Skip to main content

అనలం

కన్ను ద్వారా ఎన్ని చూసినా మనసు ప్రశాంతంగా ఉండలేక పోతుంది. 

చెవితో ఎన్ని విన్నా మనసు తృప్తి పడలేకపోతుంది. 

ఎన్ని రకాల వాసనలు పీల్చినా మనసు ఇంకా ఎదో వెలితితోనే ఉండి పోతుంది.

ఎన్నో రుచులు చవి చూసిన నాలుక ఇంకేదో రుచికై వెంపర్లాడుతుంది. 


మనం చూసింది, చేసింది, విన్నది, తిన్నది ఇక చాలు. 

వీటి ద్వారా జీవితంలో వెలుగు రాదు అనిపిస్తుంది. 

వేదన దూరం కాదు అని తెలిసొస్తుంది.

వీటితో మనసు ఎప్పటికీ శాంతి తీరాలకు చేరదు అనిపిస్తుంది.


Comments

Popular posts from this blog

ఎవరు ఆమె !!

ఏ స్త్రీ ని చూడకూడని చూపుతో చూస్తున్నావో, ఆ స్త్రీ ఎవరు..  ఆమె ఎవరు.. !! ఏ తల్లికో      ...  కన్న బిడ్డ  ఏ బిడ్డకో       ...   కన్న తల్లి  ఏ తండ్రికో    ... వరాల కూతురు  ఏ అన్నకో      ...  గారాల చెల్లెలు   ఏ చెల్లికో     ...  అక్క  ఏ వ్యక్తికో      ...  సహా ధర్మ పత్ని ఏ ఇంటికో    ...  ఇల్లాలు ఆ స్త్రీ             ... మాతృమూర్తి.  ఆ స్త్రీ హృదయం ... మాతృ హృదయం... ఆమె ... మాతా... శ్రీ మాతా...  ------ శ్రీ మాత్రే నమః ------ 

శోధన

జీవితంలో ఎప్పటికీ  పూడ్చలేని ఒక అగాధం కనపడుతుంది.  ఆ అగాధం నిండా ఆవేదన నిండి ఉంది.  అపకీర్తి, నిర్వేదం, ఆవేదన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా ఉంది. నిరాశ నన్ను నీడలా వెంబడిస్తున్నట్టుగా ఉంది. కష్టాల్లో ఉన్నా కళను కోల్పోలేదు.  నష్టాల్లో ఉన్నా తప్పుడు దారిలో నడవలేదు.  వేడాను. వెలుగును చూసాను.  పాడాను. పాడి పాడి పావనమైతే అయ్యాను.  కానీ వేదనల నుండి ఇంకా విడి పడలేదు.  కష్టాలు, నష్టాలలో శుద్ధి పడ్డానే కానీ ఇంకా శుభాన్ని చూడలేదు.  నేను చాలా అలసి పోయాను. ఎంతో విసిగి పోయాను. బాగా నీరసించి పోయాను. భగవంతుడు అదే పనిగా నన్ను శోధిస్తున్నట్టుగా ఉంది.  నేను పూర్తిగా కాలి అయ్యాను. నేను పునీతమయ్యాను,  పవిత్రమయ్యాను, పరమ పావనమయ్యాను.

ప్రయత్నం

ధర్మం తనంతట తాను గెలవదు. ధర్మాన్ని గెలిపించాలి.  శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు అవతరించి ధర్మాన్ని గెలిపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసారు. కంటికి కనపడని అతీతమైన శక్తి ఏదో వచ్చి మనల్ని కాపాడదు.  మనం ప్రయత్నించాలి, నిలబడాలి, పోరాడాలి, గెలవాలి, గెలిపించాలి.