Skip to main content

ప్రయత్నం

ధర్మం తనంతట తాను గెలవదు. ధర్మాన్ని గెలిపించాలి. 

శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు అవతరించి ధర్మాన్ని గెలిపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసారు.

కంటికి కనపడని అతీతమైన శక్తి ఏదో వచ్చి మనల్ని కాపాడదు. 

మనం ప్రయత్నించాలి, నిలబడాలి, పోరాడాలి, గెలవాలి, గెలిపించాలి. 






Comments

Popular posts from this blog

ఎవరు ఆమె !!

ఏ స్త్రీ ని చూడకూడని చూపుతో చూస్తున్నావో, ఆ స్త్రీ ఎవరు..  ఆమె ఎవరు.. !! ఏ తల్లికో      ...  కన్న బిడ్డ  ఏ బిడ్డకో       ...   కన్న తల్లి  ఏ తండ్రికో    ... వరాల కూతురు  ఏ అన్నకో      ...  గారాల చెల్లెలు   ఏ చెల్లికో     ...  అక్క  ఏ వ్యక్తికో      ...  సహా ధర్మ పత్ని ఏ ఇంటికో    ...  ఇల్లాలు ఆ స్త్రీ             ... మాతృమూర్తి.  ఆ స్త్రీ హృదయం ... మాతృ హృదయం... ఆమె ... మాతా... శ్రీ మాతా...  ------ శ్రీ మాత్రే నమః ------ 

శోధన

జీవితంలో ఎప్పటికీ  పూడ్చలేని ఒక అగాధం కనపడుతుంది.  ఆ అగాధం నిండా ఆవేదన నిండి ఉంది.  అపకీర్తి, నిర్వేదం, ఆవేదన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా ఉంది. నిరాశ నన్ను నీడలా వెంబడిస్తున్నట్టుగా ఉంది. కష్టాల్లో ఉన్నా కళను కోల్పోలేదు.  నష్టాల్లో ఉన్నా తప్పుడు దారిలో నడవలేదు.  వేడాను. వెలుగును చూసాను.  పాడాను. పాడి పాడి పావనమైతే అయ్యాను.  కానీ వేదనల నుండి ఇంకా విడి పడలేదు.  కష్టాలు, నష్టాలలో శుద్ధి పడ్డానే కానీ ఇంకా శుభాన్ని చూడలేదు.  నేను చాలా అలసి పోయాను. ఎంతో విసిగి పోయాను. బాగా నీరసించి పోయాను. భగవంతుడు అదే పనిగా నన్ను శోధిస్తున్నట్టుగా ఉంది.  నేను పూర్తిగా కాలి అయ్యాను. నేను పునీతమయ్యాను,  పవిత్రమయ్యాను, పరమ పావనమయ్యాను.