Skip to main content

Posts

Showing posts from December, 2024

అనలం

కన్ను ద్వారా ఎన్ని చూసినా మనసు ప్రశాంతంగా ఉండలేక పోతుంది.  చెవితో ఎన్ని విన్నా మనసు తృప్తి పడలేకపోతుంది.  ఎన్ని రకాల వాసనలు పీల్చినా మనసు ఇంకా ఎదో వెలితితోనే ఉండి పోతుంది. ఎన్నో రుచులు చవి చూసిన నాలుక ఇంకేదో రుచికై వెంపర్లాడుతుంది.  మనం చూసింది, చేసింది, విన్నది, తిన్నది ఇక చాలు.  వీటి ద్వారా జీవితంలో వెలుగు రాదు అనిపిస్తుంది.  వేదన దూరం కాదు అని తెలిసొస్తుంది. వీటితో మనసు ఎప్పటికీ శాంతి తీరాలకు చేరదు అనిపిస్తుంది.

ప్రయత్నం

ధర్మం తనంతట తాను గెలవదు. ధర్మాన్ని గెలిపించాలి.  శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు అవతరించి ధర్మాన్ని గెలిపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసారు. కంటికి కనపడని అతీతమైన శక్తి ఏదో వచ్చి మనల్ని కాపాడదు.  మనం ప్రయత్నించాలి, నిలబడాలి, పోరాడాలి, గెలవాలి, గెలిపించాలి. 

ఎవరు ఆమె !!

ఏ స్త్రీ ని చూడకూడని చూపుతో చూస్తున్నావో, ఆ స్త్రీ ఎవరు..  ఆమె ఎవరు.. !! ఏ తల్లికో      ...  కన్న బిడ్డ  ఏ బిడ్డకో       ...   కన్న తల్లి  ఏ తండ్రికో    ... వరాల కూతురు  ఏ అన్నకో      ...  గారాల చెల్లెలు   ఏ చెల్లికో     ...  అక్క  ఏ వ్యక్తికో      ...  సహా ధర్మ పత్ని ఏ ఇంటికో    ...  ఇల్లాలు ఆ స్త్రీ             ... మాతృమూర్తి.  ఆ స్త్రీ హృదయం ... మాతృ హృదయం... ఆమె ... మాతా... శ్రీ మాతా...  ------ శ్రీ మాత్రే నమః ------