అప్పటికప్పుడు చేసుకునే చక్కటి పదార్థము ఇది. తయారు చేసుకునే విధానము: కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, అరటి కాయని కూడా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని కలుపుకొని అందులో చక్కెర మనకు సరిపోయినంతగా కలుపుకోవాలి. చక్కెరకు బదులు బెల్లముగాని, తేనేగాని కూడా వేసుకోవచ్చు. కాని ఏదో ఒకటే వేసుకోవాలి. కొబ్బరికాయ ఎంత లేతగా ఉంటే అంత రుచిగా ఉంటుంది ఈ పదార్థము. సామాన్యమైన అరటిపండుతో మాత్రమే కాకుండ, కర్పూరం రకంతో లేదా చక్కెరకేళి రకంతో కూడా చేసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం అల్పాహారంగా, ఆకలిగా ఉండి వండుకోవడానికి సమయం లేకుంటే మధ్యాహ్నం భోజనంగా కూడా ఈ పదార్థాన్ని హాయిగా తినేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఎంతో బలాన్ని ఇస్తుంది. --- ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః ---
Learning how to Love and to be Loved; A Software Engineer; Novice Culinarian; Loves Listening, Writing, Singing, Reading.