అప్పటికప్పుడు చేసుకునే చక్కటి పదార్థము ఇది.
తయారు చేసుకునే విధానము:
కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, అరటి కాయని కూడా ముక్కలుగా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రెండిటిని కలుపుకొని అందులో చక్కెర మనకు సరిపోయినంతగా కలుపుకోవాలి.
చక్కెరకు బదులు బెల్లముగాని, తేనేగాని కూడా వేసుకోవచ్చు. కాని ఏదో ఒకటే వేసుకోవాలి.
కొబ్బరికాయ ఎంత లేతగా ఉంటే అంత రుచిగా ఉంటుంది ఈ పదార్థము.
సామాన్యమైన అరటిపండుతో మాత్రమే కాకుండ, కర్పూరం రకంతో లేదా చక్కెరకేళి రకంతో కూడా చేసుకోవచ్చు.
ఉదయం, సాయంత్రం అల్పాహారంగా, ఆకలిగా ఉండి వండుకోవడానికి సమయం లేకుంటే మధ్యాహ్నం భోజనంగా కూడా ఈ పదార్థాన్ని హాయిగా తినేయొచ్చు.
చాలా రుచిగా ఉంటుంది. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఎంతో బలాన్ని ఇస్తుంది.
--- ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః ---
Comments
Post a Comment