కాలమౌషదమ్ము కలత చెందగనేల ఎట్టి గాయమైన ఇట్టే మాన్పు మచ్చ చూసుకొనుచు మసలిపో పనియేమి మనసు పెట్టి వినుము మాధవోక్తి
ఈరోజు తెల్లవారుజామున 3.30 కి లేచి పనులన్నీ పూర్తి చేయనుకోని పూజ చేసి మాకు దగ్గరలో ఉన్న గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాను. గుడి నుంచి వచ్చి, భాగవతం, భగవద్గీత, శంకరాచార్య స్తోత్రాలు చదవడం ప్రారంభించాను. విష్ణు సహస్ర నామాలు చదువుదాము అనుకున్న. కానీ ఆఫీస్ పనుల వల్ల, సమయ అభావం వల్ల వీలుకాలేదు. సాయంత్రం ఆఫీస్ పని అయిపోయింతర్వాత పూజ పూర్తి చేసి, ఇంటికి వచ్చాను.