జీవితంలో ఎప్పటికీ పూడ్చలేని ఒక అగాధం కనపడుతుంది. ఆ అగాధం నిండా ఆవేదన నిండి ఉంది. అపకీర్తి, నిర్వేదం, ఆవేదన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా ఉంది. నిరాశ నన్ను నీడలా వెంబడిస్తున్నట్టుగా ఉంది. కష్టాల్లో ఉన్నా కళను కోల్పోలేదు. నష్టాల్లో ఉన్నా తప్పుడు దారిలో నడవలేదు. వేడాను. వెలుగును చూసాను. పాడాను. పాడి పాడి పావనమైతే అయ్యాను. కానీ వేదనల నుండి ఇంకా విడి పడలేదు. కష్టాలు, నష్టాలలో శుద్ధి పడ్డానే కానీ ఇంకా శుభాన్ని చూడలేదు. నేను చాలా అలసి పోయాను. ఎంతో విసిగి పోయాను. బాగా నీరసించి పోయాను. భగవంతుడు అదే పనిగా నన్ను శోధిస్తున్నట్టుగా ఉంది. నేను పూర్తిగా కాలి అయ్యాను. నేను పునీతమయ్యాను, పవిత్రమయ్యాను, పరమ పావనమయ్యాను.
Learning how to Love and to be Loved; A Software Engineer; Novice Culinarian; Loves Listening, Writing, Singing, Reading.